వివిఆర్ ఎఫెక్ట్ ట్రిపుల్ ఆర్ మీద పడుతుందా

-

భరత్ అనే నేను హిట్ అందుకున్న నిర్మాత డివివి దానయ్య ఈమధ్య వచ్చిన చరణ్ వినయ విధేయ రామతో పెద్ద ఎత్తున నష్టాలు భరించాల్సి వస్తుంది. బోయపాటి శ్రీను, రాం చరణ్ కలిసి చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండగా ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. 92 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన వివిఆర్ ఇప్పటివరకు 60 కోట్లు మాత్రమే రాబట్టింది.

అయితే ఈ సినిమా ఎఫెక్ట్ దానయ్య చేస్తున్న ట్రిపుల్ ఆర్ మీద పడకూడదన్న ఉద్దేశంతో భారీ నష్టాలపాలైన వారికి నష్ట పరిహారం చెల్లిస్తున్నారట. వినయ విధేయ రామ సినిమా నైజాం, ఏపి కలిపి యువి క్రియేషన్స్ 72 కోట్లకు కొన్నారు. అయితే కలక్షన్స్ 50 కోట్లు మాత్రమే రాగా నష్ట పరిహారంగా దానయ్య 5 కోట్ల వరకు రిటర్న్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ లో కూడా వివిఆర్ భారీ నష్టం తెచ్చిపెట్టింది. 10 రోజుల్లో కేవలం 1.43 కోట్లు మాత్రమే రాబట్టింది. అక్కడ కూడా ఎంతోకొంత ఇచ్చి సెటిల్ చేస్తున్నాడట.

మొత్తానికి వినయ విధేయ రామ సినిమా మిగిల్చిన నష్టాల ఎఫెక్ట్ ఆర్.ఆర్.ఆర్ మీద పడకుండా డివివి దానయ్య భాగానే మ్యానేక్ చేస్తున్నాడు. అయితే వివి ఆర్ నిరాశ పరచినా రాజమౌళి సినిమా మాత్రం తప్పకుండా సంచలనాలు సృష్టిస్తుందని అంటున్నారు. ఈరోజు నుండే ట్రిపుల్ ఆర్ సెకండ్ షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news