బర్త్ డే రోజున యశ్‌ ఫ్యాన్స్ కు షాకిచ్చిన ‘కెజిఎఫ్’ టీమ్….!!

-

2007లో వచ్చిన కన్నడ సినిమా జంబడ హుడుగి అనే సినిమాతో శాండల్ వుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కన్నడ రాక్ స్టార్ యశ్‌, అంతకముందు పలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు దక్కించుకున్నాడు. ఆయన తండ్రి ఒక బస్సు డ్రైవర్ అయినప్పటికీ, యశ్‌కు నటనపై మంచి ఆసక్తి ఉండడంతో ఎలాగైనా అతడిని నటుడుని చేయాలని ఎంతో కష్టపడి బుల్లితెరపై అతడిని రంగప్రవేశం చేయించారు. ఇక అక్కడి నుండి మెల్లగా తన నటనతో అందరి ఆకట్టుకున్న యశ్‌, ఆపై సినిమా రంగంలో ప్రవేశించి, ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకోవడంతో పాటు వాటిని సక్సెస్ లుగా మలుచుకుని ముందుకు సాగాడు.

ఇక గత ఏడాది యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కెజిఎఫ్ చాప్టర్ 1లో నటించిన యశ్‌, పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ అయిన ఆ సినిమాతో అతి పెద్ద విజయాన్నిఅందుకుని దేశవ్యాప్తంగా అద్భుతమైన పేరుని గడించారు. ఇక ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న కెజిఎఫ్ చాప్టర్ 2లో నటిస్తున్న యశ్‌, నిన్న తన 34వ జన్మదినాన్ని తన కుటుంబసభ్యుల మధ్యన ఎంతో ఘనంగా జరుపుకున్నాడు. ఇకపోతే నిజానికి నిన్న చాప్టర్ 2 ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కావలసి ఉంది. అయితే కొన్ని అనుకోని కారణాల వలన టీజర్ ని రిలీజ్ చేయలేకపోతున్నాం అని, అందువలనే ఒక సరికొత్త పోస్టర్ ని యశ్‌ ఫ్యాన్స్ కోసం గిఫ్ట్ గా రిలీజ్ చేస్తున్నాం అని కెజిఎఫ్ టీమ్ తరపున దర్శకుడు ప్రశాంత్ నీల్ మీడియాకి తెలిపారు. ఇక ఆ పిక్ లో సుత్తి పట్టుకుని ఉన్న యశ్‌ని చూస్తుంటే, చాప్టర్ 1 ని మించేలా ఈ చాప్టర్ 2 తెరకెక్కుతోందని అర్ధం అవుతుందని పలువురు యశ్‌ ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. తాము ఆశించినట్లు టీజర్ రాకపోయినప్పటికీ పోస్టర్ అయినా రిలీజ్ చేసినందుకు కెజిఎఫ్ టీమ్ కి కృతజ్ఞతలు చెప్తూ, యశ్‌కు బర్త్ డే విషెస్ తెలియచేసారు……!!

Read more RELATED
Recommended to you

Latest news