తెలంగాణాలో కొత్త వాహన రిజిస్ట్రేషన్ కు ఆర్టీవో ఆఫీస్ కు అవసరం లేదు…!

-

తెలంగాణలో కొత్త వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయించుకొనే వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగకుండా చూడటానికి తెలంగాణా ప్రభుత్వం ప్రణాళికను సిద్దం చేసింది. ఇన్నాళ్ళు కొత్త వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే, ఆర్టీవో ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. దీనికి మంగళం పాడాలని భావిస్తున్నారు.

ఇందులో భాగంగా షోరూంలో వాహనం కొన్న వ్యక్తి అక్కడే రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసుకునేలా కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. వాహన తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొత్తాన్ని డీలర్‌ పరిధిలోనే పూర్తి చేయడం కోసం సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే హై సెక్యూరిటీ నంబరు ప్లేట్లు తయారీ రవాణాశాఖ నుంచి షోరూం పరిధిలోకి వెళ్ళగా,

అదే మార్గంలో వాహన రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని డీలర్లకు అప్పగించేలా రవాణాశాఖ ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో వాహన రిజిస్ట్రేషన్లను డీలర్లకు అప్పగించడం ద్వారా అక్కడ రూ.కోట్ల విలువైన అక్రమాలు జరగడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్న అధికారులు, సౌకర్యవంతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది.ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో అందుబాటులోకి రావచ్చని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news