రాఖీ భాయ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు..దూసుకుపోతున్న KGF2

-

గత నెల 14న విడుదలైన KGF చాప్టర్ 2 బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ ఈ సినిమా తిరగరాస్తోంది. రాఖీ భాయ్ ప్రపంచవ్యాప్తంగా తన హవా చూపుతున్నారు. ప్రశాంత్ నీల్- యశ్ కాంబోలో తెరకెక్కిన ఈ కేజీఎఫ్ చాప్టర్ 2.. చాప్టర్ 1ను మించి సక్సెస్ అయింది.

తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్ల మైల్ స్టోన్‌ను క్రాస్ చేసింది. ఇటువంటి అరుదైన రికార్డు సాధించిన మొద‌టి శాండ‌ల్ వుడ్ సినిమాగా KGF2 హిస్టరీలో మిగిలిపోనుంది. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా స్పెషల్ వీడియో షేర్ చేసింది KGF2 హీరోయిన్ శ్రీనిధిశెట్టి. ఈ సంగతి తెలుసుకుని నెటిజన్లు, సినీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ అయిన KGF2 దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల విశేష ఆదరణకు నోచుకుండటం పట్ల సినీ పరిశీలకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో అయితే ఉన్న రికార్డులన్నిటినీ KGF2 క్రాస్ చేసింది.

ఈ పిక్చర్ లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషించారు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్ కాగా, రవి బస్రూర్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news