నాతో సెక్స్ చేయ్.. నీకు జాబ్ గ్యారంటీ..

ఒకరి అవసరం మరొకరికి అవకాశంలా మారుతోంది.. స్త్రీ ల విషయంలో ఇది మరీ దారుణంగా తయారవుతోంది. ఒక మగాడికి ఉద్యోగం కావాలంటే.. లంచం ఇచ్చో.. కాకా పట్టో.. ఫైరవి చేసి ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు. అయితే.. అండలేని స్త్రీలకు ఉద్యోగం రావాలంటే.. కొందరు వారి అవసరాన్ని అవకాశంగా తీసుకుంటున్నారు. సినిమాల్లో ఛాన్స్ కావాలంటే.. పడక సుఖం ఇవ్వాల్సిందేనా.. అంటూ మీటు ఉద్యమం చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ పరిస్థితి కేవలం.. చిత్ర పరిశ్రమకు చెందిన సమస్య కాదు.. ప్రతి చోట మహిళలు, యువతులు ఇలాంటి ఘటనలు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఘటనే ఇది. అయితే ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.

అయితే.. ఇంటర్వ్యూకు ఓ యువతి వచ్చింది.. సదరు యువతికి ఈ ఉద్యోగం చాలా అవసరం.. ఎందుకంటే.. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అలాంటిది. ఉద్యోగం కోసం కావాల్సిన అర్హతలు అన్ని ఉన్నా.. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. నీకు ఈ ఉద్యోగం కావాలంటే.. నాతో ఓ రాత్రి గడపాలని షరతు పెట్టాడు.. దీంతో ఖంగుతిన్న సదరు యువతి.. తేరుకొని.. సరే అని చెప్పింది.. అయితే ఈ రోజు రాత్రికే.. ఫలానా హోటల్ కు రా.. అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు.. సరే అని.. చెబుతూ సదరు యువతి వెళ్ళింది.. రాత్రి హోటల్ వద్దకు వెళ్ళగానే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే.. ఓ రూమ్ నెంబర్ చెప్పి ఆ గదికి రమ్మన్నాడు.. సరే అని ఫోన్ కట్ చేసి.. ఆ వ్యక్తి చెప్పిన రూమ్ కాలింగ్ బెల్ కొట్టింది.. దీంతో.. సదరు వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేయగానే.. ఎదురుగా తన బాస్ ప్రియా (పేరు మార్చాము).

అక్కడ తన బాస్ ను చూసేసరికి షాక్ తిన్న ఆ వ్యక్తి నోట మాట రాలేదు.. అయితే.. సదరు యువతి.. ఈ వ్యక్తి తనతో పడుకోవాలని చెప్పాక.. కాసేపు ఆలోచించుకొని.. సరే చెప్పింది.. ఆ వ్యక్తి భరతం పెట్టడానికే.. ఆ వ్యక్తి దగ్గర నెంబర్ తీసుకొని వెళ్లిన..యువతి డైరెక్ట్ గా ఆ కంపెనీ బాస్ కి ఆ వ్యక్తి గురించి మెసేజ్ పెట్టింది.. దీంతో బాస్ డైరెక్ట్ గా కాల్ చేసి విషయం తెలుసుకొని.. హోటల్ కు తనతో వచ్చింది.. పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ వ్యక్తిని కటకటాల పాలు చేసింది. అదే కంపెనీలో సదరు యువతికి జాబ్ వచ్చింది.. ప్రతి అమ్మాయి కూడా.. ఇలా ఉండాలని.. రోల్ మోడల్ తీసుకోవాలని.. బాస్ ఉద్యోగులతో వ్యాఖ్యానించింది.. అంతేకాకుండా.. సహుద్యోగులు ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు.