కొన్నిసార్లు నిశ్శబ్దం చేసే మేలు దగ్గర
తుఫానులు కూడా చిన్నబోతాయి
వెలవెలబోతాయి కూడా !
ఆ విధంగా యష్ సైలెంట్ గానే వచ్చాడు
సీక్వెల్ కేజీఎఫ్‌తో కలెక్షన్ల తుఫాను రేపాడు
ఆ విధంగా ట్రిపుల్ ఆర్ ను కూడా దాటిపోతున్నాడు
బంగారు గనులకు సంబంధించిన కథ
బంగారు కలలను సాధించండి అని చెప్పిన కథ
కలల సాకారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ
కోలారు గనుల నుంచి కర్ణాటక తుది తీరం వరకూ
కర్ణాటక తీరం నుంచి భారత దేశ సరిహద్దుల వరకూ
ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ పెద్దవాడు అయ్యాడు. రాకీ భాయ్ మళ్లీ నచ్చాడు. ఆయన నడవడికి అమ్మాయిలు కూడా ఫిదా అయిపోయారు. అవును! ఒకప్పుడు రాకీ భాయ్ అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ ఇప్పుడు భాయ్ కాదు బాక్సాఫీస్ కా బాద్షా..ఇండియన్ సినిమా లిటరేచర్ నే మార్చే స్థాయి రాకీ భాయ్ కి మాత్రమే ఉంది. ఆయన శక్తి గొప్పది. ఆయన పొగరు కూడా బాగుంది. అందుకే సినిమా కొనసాగింపు అంతా ఆ పొగరుతోనే ఉంటాడు.. వాడు గాయపడ్డ సింహం అవును! ఆ గర్జన విని గ్రేట్ అనాల్సిందే..అనండిక మరోసారి సలామ్ రాకీ భాయ్ అని!
కలెక్షన్ల డేటా ఇది…
తెలుగులో తొలి రోజు కలెక్షన్ 35కోట్ల గ్రాస్ ..అదే కన్నడలో కూడా .. అంటే రెండు భాషల్లో కలిపి 70 కోట్ల గ్రాస్. హిందీలో అరవై కోట్ల గ్రాస్ అంటే ఇక్కడికే 130 కోట్లు గ్రాస్ కలెక్షన్ కొట్టాడు. ఇదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా భాయ్ మొదటి రోజే అనూహ్యం అయిన కలెక్షన్లు కొట్టేశాడు. అంతా కలిపి 175 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసి ఉంటాడని తెలుస్తోంది. రెండు రోజులకూ వచ్చిన డబ్బుల వివరాలివి. ఇదే స్పీడు ఇకపై కూడా కొనసాగిస్తే ట్రిపుల్ ఆర్ కలెక్షన్ డాటాను చించేయ్యడం ఖాయం.
ఆ విధంగా భాయ్ ప్రపంచ స్థాయిలోనే తన హవాకు తిరుగేలేదని చెబుతున్నాడు. ఎక్కడా హంగామా లేకుండా, ఎక్కడా అతి ప్రచారం కూడా లేకుండా ఈ సినిమా విడుదల చేసిన పద్ధతి, సినిమా గురించి యష్ చెప్పిన మాటలు సంబంధిత వివరాలు అందించిన పద్ధతి అవన్నీ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి. కేజీఎఫ్ ఫస్ట్ చాప్టర్ ఇప్పుడు చూసి తరువాత సెకండ్ చాప్టర్ చూసేందుకు వెళ్తున్న వారూ ఉన్నారు. ఏదేమయినా ఈ సినిమా ఓ వండర్. ఆన్ స్క్రీన్ వండర్ అని రాయాలి.
వాడు యష్..ఎస్..దటీజ్ యష్..
ఇప్పుడు దారి చూడు..దుమ్ము చూడు..ఒక్కడు వస్తున్నాడు..బస్సు పోతున్నంత వే గంగా ఒక్కడు పోతున్నడు..వేగంగా పోతు న్నడు..జీవితం ఏం నేర్పిందో చెప్పిపోతు న్నడు..ఒక నాటకం చివర్లో ఉన్నాడు..ఒక సినిమా మొదటి నుంచి చివరిదాకా ఉన్నాడు ..చప్పట్లు నవీన్ కుమార గౌడ అలియాస్ యష్ ను మురిపిస్తున్నాయి. అవే చాలు..ఇంకేవీ వద్దు.. ఈలలు గోలలూ మరింత పెద్దవాణ్నిచేస్తున్నాయి..అవి చాలు..ప్రేమ పంచిన నేలకు, ప్రేమతో పెంచిన నాన్నకు వందనాలు చెల్లిస్తూ వాడు..ఇప్పుడు యష్ గా రూపాంతరం చెందాడు. కన్నడ నాట నుంచి దేశం యావత్తూ తనవైపు చూసేలా ఐ-ఓపెనర్ అయ్యాడు..వాడు యష్..ఎస్..దటీజ్ యష్..