బ్యూటిఫుల్ హీరోయిన్ కామ్నా జెఠ్మలాని ఇటీవల కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ, గతంలో ఈమె నటించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సుందరి..వైవాహిక జీవితం తర్వాత సినిమాలు పెద్దగా చేయడం లేదు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈమె..ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ సుందరి ఎరుపు రంగు చీరలో దిగిన ఫొటో షేర్ చేసింది. అది చూసి నెటిజన్లు వావ్..మిర్చిలాంటి ఘాటైన తన అందాలను కుర్రకారుకు వేసి పిచ్చెక్కిస్తున్నదని అంటున్నారు.
స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి రెడ్ శారీలో అలా కూర్చొని నెటిజన్లు హృదయాల్లో స్థానం సంపాదించుకుంది ఈమె. ఇక ఈ భామ ఫొటోలు చూసి వావ్..లుకింగ్ బ్యూటిఫుల్, గార్జియస్, వాహ్..వా అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
ఈ భామ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘చంద్రిక’ చిత్రంలో కనిపించింది. ‘ప్రేమికుడు ’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కామ్నా జెఠ్మలానికి మ్యాచో మ్యాన్ గోపీచంద్ ‘రణం’ చిత్రంతో చక్కటి గుర్తింపు లభించింది. ఈ భామ ఇటీవల కాలంలో ఎరుపు రంగు చీర ధరించిన ఫొటోలను వరుసగా షేర్ చేస్తోంది. తనకు చీర కట్టు అంటే చాలా ఇష్మని పేర్కొంటున్నది. మెడ్రన్ డ్రెస్సులోనే చక్కగా ఉండే ఈ సుందరి..త్వరలో వెండితెరపైన చక్కటి పాత్ర పోషించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.