KHILADI REVIEW : “ఖిలాడి” రివ్యూ

-

మాస్‌ మహారాజ్‌ రవితేజ… యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఖిలాడీ. రమేష్‌ వర్మ దర్శ కత్వంలో రూపొందింతున్న ఈ సినిమా ను ఏ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్పీ పతాకం పై సత్య నారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కు సౌండ్‌ ట్రాక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ స్వర పరస్తున్నారు. ఇందులో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ముకుందన్‌, మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్‌ అయింది.

 

కథాంశం ; మీనాక్షి పూజ పాత్రలో ఇంటెలిజెన్స్ ఐజీ జయరామ్ కుమార్తె గా నటించింది. చాలా తెలివైన అమ్మాయి. క్రిమినల్ సైకాలజీ చదువుతోంది పూజ. ఈ దొంగల కోసం సెంట్రల్ జైలు శిక్ష అనుభవిస్తున్న మోహన్ గాంధీ… అంటే రవితేజ ను కలుస్తుంది. హోంమంత్రి పాత్రలో నటిస్తున్న ముఖేష్రుషి పది వేల కోట్లకు సంబంధించి లావాదేవీల వల్ల నేల సమస్యల్లో చిక్కుకున్న ది… కుటుంబాన్ని పోగొట్టుకుని చేయని నేరానికి జైలుకు ఎలా రావాల్సి వచ్చింది… అనేవన్నీ కట్టు కథలా హీరోయిన్ పూజ కి చెప్తాడు. ఆ కథ నిజమని నమ్మిన పూజ… రవితేజ కు సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంటుంది.

 

తన తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరీ రవితేజ కు వచ్చేలా చేస్తుంది. సరిగ్గా గాంధీ బయటకు రాగానే అతని జీవితానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తుంది. అతడు అంతర్జాతీయ క్రిమినల్ అని.. హోంమంత్రి డబ్బు కొట్టేయడానికి ఇటలీ నుంచి ఇండియాకు వచ్చాడని… ఇందుకోసం చాలా తెలివిగా తనను వాడుకున్నాడని పూజకు అర్థమవుతుంది.

మరి ఆ డబ్బు ఎవరిది ? ఇక్కడ దాచారు ? ఆ డబ్బుతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని ఆశపడిన గురు సింగం కోరిక తీరుతుందా ? డబ్బులు కొట్టాలన్న గాంధీ కోరిక నెరవేరుతుందా ? డబ్బుతో పాటు గాంధీ ని పట్టుకోవాలన్న సిబిఐ అధికారి అర్జున్ భరద్వాజ్ అంటే అర్జున్ లక్ష్యం నెరవేరిందా ? ఈ మొత్తం కథలో డింపుల్ హయాతి, జబర్దస్త్ బ్యూటీ అనసూయ మురళీ శర్మ పాత్ర ఏంటి ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. జై సినిమా లో రెండు షేడ్స్ ను రవితేజ అద్భుతంగా పండించాడు. ద్వితీయార్థంలో ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. ఆటో హీరోయిన్ల గ్లామర్ కూడా సినిమాకు బాగా కలిసి వచ్చింది.

బలాలు :
రవితేజ నటన,

డింపుల్ హయాతి అలాగే మీనాక్షి అందాలు

యాక్షన్ సీక్రెట్స్

నెగిటివ్

ఊహకు తగ్గట్లుగా సాగే కథ
సాగతీత సన్నివేశాలు
క్లైమాక్స్

రేటింగ్ :2/5

Read more RELATED
Recommended to you

Latest news