ముస్లిం సమాజానికి విద్య అవసరం… హిజాబ్ కాదు: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

-

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం హిజాబ్ అంశం చర్చనీయాంశం అవుతోంది. కర్ణాటకలో ప్రారంభమైన ఈ వివాదం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుని జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హిజాబ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం సమాజానికి విద్య కావాలని.. హిజాబ్ కాదని అన్నారు. పొలిటికల్ ఇస్లాంను కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేస్తుందని ఘాటుగానే విమర్శించారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ తరుపున ప్రచారం చేశారు బిశ్వ శర్మ.

హిజాబ్ ధరిస్తే విద్యార్థికి టీచర్ చెప్పే పాఠాలు అర్థం అయ్యాయని ఎలా తెలుస్తుందంటూ కామెంట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో అగ్రగామి దేశంగా భారత్ ను మార్చేందుకు ప్రయత్నిస్తుంటే.. ఇతరులు మాత్రం హిజాబ్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. గతంలో భారతదేశంలో తయారైన కోవిడ్ వ్యాక్సిన్ల గురించి కూడా కాంగ్రెస్ ప్రశ్నించిందని అన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడ బుజ్జగింపు రాజకీయాలు చేసేందుకు వచ్చారని.. దేశం కోసం కాదని విమర్శించారు. కానీ ప్రధాని మోదీ దేశం కోసమే జీవిస్తున్నారని అన్నారు హిమంత బిశ్వ శర్మ.

 

Read more RELATED
Recommended to you

Latest news