హింది అర్జున్ రెడ్డిలో కియరా..!

-

సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా లాస్ట్ ఇయర్ ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఈ హీరో విజయ్ దేవరకొండ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. అర్జున్ రెడ్డితో వచ్చిన క్రేజ్ కాస్త గీతా గోవిందం సినిమా హిట్ తో మరింత పెంచుకున్నాడు. యూనివర్సల్ సబ్జెక్ట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా హింది, తమిళంలో రీమేక్ అవుతుంది.

తమిళంలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా చేస్తుండగా హిందిలో షాహిద్ కపూర్ హీరోగా చేస్తున్నాడు. హింది అర్జున్ రెడ్డి సినిమాను సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. భరత్ అనే నేను సినిమాతో తెలుగులో సూపర్ స్టార్ తో సూపర్ హిట్ అందుకున్న కియరా బాలీవుడ్ లో ఎమ్మెస్ ధోని సినిమా చేసింది.

లస్ట్ స్టోరీస్ అంటూ వచ్చిన వెబ్ సీరీస్ లో కూడా తన సత్తా చాటిన కియరా అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ లో నటించడం నిజంగా లక్కీ ఆఫర్ అనే చెప్పొచ్చు. మరి తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి బీ టౌన్ లో ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news