హలో గురు ప్రేమ కోసమే ఫస్ట్ సాంగ్ ఇదే..!

-

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలోని మొదటి సాంగ్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది.

మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్ అంటూ వచ్చిన ఈ పాట దేవి మార్క్ మ్యూజిక్ తో వచ్చింది. ట్రెండ్ మ్యూజిక్ తో వచ్చిన ఈ సినిమాలోని ఈ సాంగ్ హలో గురు ప్రేమకోసమే సినిమాపై అంచనాలు పెంచిందని చెప్పొచ్చు. శ్రీమణి రచించిన ఈ పాటని ఆల్ఫోన్స్ జోసెఫ్ పాడటం జరిగింది.

దసరా బరిలో వస్తున్న ఈ సినిమా క్రేజీ లవ్ స్టోరీగా వస్తుంది. నేను లోకల్ సినిమా తర్వాత నక్కిన త్రినాథ రావు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news