తాత కాబోతున్న నాగార్జున..!

-

సీనియర్ స్టార్ హీరోలలో ఇప్పటికే బాలకృష్ణ, చిరజీవిలు తాతలుగా మారారు. వెంకటేష్, నాగార్జున మాత్రమే ఇంకా ఆ హోదా దక్కించుకోలేదు. వెంకటేష్ కు ఆ ఛాన్స్ ఇంకా టైం పట్టేట్టు ఉండగా ఇప్పుడు నాగార్జున తాతగా మారబోతున్నాడని తెలుస్తుంది. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య, సమంతలు ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరు నాగార్జునని తాతని చేసే పనిలో ఉన్నారట. అయితే అంతకుముందే రీల్ లైఫ్ తాత కాబోతున్నాడు మన కింగ్.

అదేంటి అంటే కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తెలుసు కదా.. ఆ సినిమా సీక్వల్ గా బంగార్రాజు సినిమా ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఈ సినిమాలో నాగార్జునతో పాటుగా తనయుడు నాగ చైతన్య కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ మూవీలో నాగార్జున తాత పాత్రలో నటిస్తుండగా బంగార్రాజు మనవడిగా నాగ చైతన్య కనిపిస్తాడట.

మొత్తానికి రియల్ లైఫ్ లో తాత అయ్యేందుకు రెడీగా ఉన్న నాగార్జున రీల్ లైఫ్ లో ఆ రోల్ చేసేస్తున్నాడు. మరి తాతగా నాగార్జున ఎలా అలరిస్తాడో చూడాలి. అన్నపూర్ణ కాంపౌండ్ లోనే బంగార్రాజు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయట. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news