10 ఇయర్ చాలెంజ్ గురించి మీరు విన్నారా? వినే ఉంటారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 10 ఇయర్ చాలెంజ్‌కు సంబంధించిన ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అసలేంటి ఈ 10 ఇయర్ చాలెంజ్ అంటే.. 2009 లో మీరు ఎలా ఉన్నారు.. ఇప్పుడు అంటే 10 ఏళ్ల తర్వాత 2019లో ఎలా ఉన్నారు. అప్పటి, ఇప్పటి రెండు ఫోటోలను జతకలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి 10ఇయర్‌చాలెంజ్ హ్యాష్‌టాగ్‌ను జతచేయాలి. అదే టెన్ ఇయర్ చాలెంజ్.
ముందు ఎవరు ప్రారంభించారో కానీ.. 10 ఇయర్ చాలెంజ్ హ్యాష్‌టాగ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. సినిమా సెలబ్రిటీల దగ్గర్నుంచి.. వివిధ రంగాల్లో ఉన్న సెలబ్రిటీలంతా 10 ఇయర్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు. తమ ఫోటోలను పెడుతున్నారు.
అయితే.. క్రికెటర్ రోహిత్ శర్మ మాత్రం.. కొంచెం డిఫరెంట్‌గా తన 10 ఇయర్ చాలెంజ్ మెసేజ్‌ను షేర్ చేశారు. ఆ ఫోటో చూస్తే కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. 2009 లో పర్యావరణం ఎలా ఉండేది. ఇప్పుడు 2019 లో ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్క ఫోటోతో తేల్చేశాడు.
అండర్‌వాటర్‌లో పర్యావరణం 2009 లో ఎలా ఉండేది.. 2019లో ఎలా అయిపోయిందన్న కాన్సెప్ట్‌తో ఫోటో పెట్టిన రోహిత్.. ఇంతకంటే మనం ఇంకా ఎక్కువ బాధ పడాల్సిన 10 ఇయర్ చాలెంజ్ ఇంకేముంటుంది అంటూ ట్వీట్ చేశాడు. మనోడి 10 ఇయర్ చాలెంజ్ మెసేజ్‌కు నెటిజన్లు చలించిపోయారు. వావ్.. కనీసం నీకైనా పర్యావరణంపై అంతో ఇంతో స్పృహ ఉన్నందుకు గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
The only #10YearChallenge we should be worried about pic.twitter.com/Tph0EZUbsR
— Rohit Sharma (@ImRo45) January 17, 2019