‘కాఫీ షో’కి తాప్సీని ఆహ్వానించకపోవడంపై కరణ్ జోహార్ క్లారిటీ

-

ది ఫేమస్ సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌ – 7 ముగిసింది. 12 వారాలపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఈ షో ఆలియా భట్‌ – రణ్‌వీర్‌ సింగ్‌ జోడీతో మొదలై.. బాలీవుడ్ వైవ్స్ టీమ్ తో ఎండ్ అయింది. ఈ సీజన్ లో జాన్వీకపూర్‌ – సారా అలీఖాన్‌, అక్షయ్‌కుమార్‌ – సమంత, విజయ్‌ దేవరకొండ – అనన్యా పాండే, అమిర్‌ఖాన్‌ – కరీనాకపూర్‌, విక్కీకౌశల్‌ – సిద్ధార్థ్‌ మల్హోత్ర, క్రితి సనన్-టైగర్ ష్రాఫ్, కత్రినా కైఫ్- ఇషాన్ కత్తర్ – సిద్ధాంత్ చతుర్వేది .. ఇలా పలు జంటలు పాల్గొని సందడి చేశాయి. తాజాగా ప్రసారమైన 13వ ఎపిసోడ్‌లో ఈ షోకు జ్యురీ సభ్యులుగా వ్యవహరిస్తోన్న సోషల్‌మీడియా సెలబ్రిటీలు పాల్గొని అవార్డులు ప్రకటించారు.

 

సాధారణంగా ఈ షోలో కరణ్.. సెలబ్రిటీలను రోస్ట్ చేస్తుంటాడు. కానీ తాజా ఎపిసోడ్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కరణ్ ను రోస్ట్ చేశారు. కాస్త ఇంట్రెస్టింగ్.. ఇంకాస్త కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగి కరణ్ ను చిక్కుల్లో పెట్టారు. అయితే ఈ ఎపిసోడ్ లో కుషా కపాలా.. కరణ్ ను ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు.

‘‘గడిచిన రెండేళ్లలో కెరీర్‌పరంగా మంచి విజయాలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటీనటులను ఇంకా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోకు ఆహ్వానించలేదు. అలా పిలవనివారిలో తాప్సీ ఒకరు. ఎందుకలా?’’ అని ప్రశ్నించగా.. ‘‘మీకు బాగా తెలుసు ఇది 12 ఎపిసోడ్ల సీజన్‌. ప్రేక్షకుల్ని అలరించేవిధంగా ఉండే సెలబ్రిటీ జోడీలను టీమ్‌ ఎంపిక చేసింది. తాప్సీకి సెట్‌ అయ్యేలా జోడీ దొరికితే.. ఆమెను నేనే ఆహ్వానిస్తాను. అప్పుడామె ఒప్పుకోకపోతే బాధపడతాను’’ అని కరణ్‌ తెలిపారు.

గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న తాప్సీ.. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొనకపోవడంపై స్పందించింది. ‘ఆ షోలో పాల్గొనేంత ఆసక్తికరంగా నా శృంగార జీవితం లేదు’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరింది.

Read more RELATED
Recommended to you

Latest news