హీరో విశాల్ అరెస్ట్..!

-

కోలీవుడ్ హీరోను పోలీసులు అరెస్ట్ చేశారు. 2015లో నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గా గెలిచిన విశాల్ సంఘం తరపున ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిర్మాతల మండలి విశాల్ మీద సీరస్ గా ఉన్నారు. నిన్న నిర్మాతలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర ధర్నా చేశారు. వారే నిర్మాతల మండలి ఆఫీస్ కు తాళం వేసుకుని వెళ్లారు. నిన్న అక్కడ లేని విశాల్ ఈరోజు బలవంతంగా తాళం తీసే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ఇదవరకు ఉన్న వారు నడిగర్ సంఘం భవనం కోసం 8 కోట్లు లెక్కలు రాశారని. వాటిని జనరల్ మీటింగ్ లో బయటపెడతానని కుట్ర పన్ని ఇలా చేస్తున్నారని అన్నారు. అంతేకాదు లోపల ఉన్న ఫైల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని వాటికి ఎలా రక్షణ ఇస్తారని పోలీసుల మీద ఫైర్ అయ్యాడు విశాల్. అంతేకాదు త్వరలోనే ఇళయరాజాతో పెద్ద ప్రోగ్రాం ప్లాన్ చేశామని.. దాన్ని దెబ్బ తీసేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు విశాల్. మొత్తానికి నడిగర్ సంఘం గొడవలు కోలీవుడ్ అంతా హీటెక్కేలా చేశాయి. లెక్కలన్ని బయటపెడతా అని విశాల్ శపథం చేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version