కుంభమేళాలో ‘టాయిలెట్ కేఫెటేరియా’.. విస్తుపోతున్న జనం

-

యాక్.. టాయిలెట్ కేఫెటేరియా ఏంది.. మీ మొహం అంటారా? అవును.. కుంభమేళాలో అదే స్పెషల్ అట్రాక్షన్. నమ్మరా? మీరు పైన చూస్తున్న ఫోటో దానికి సంబంధించినదే. అదే కుంభమేళాకు వెళ్లిన జనాలను ఆకర్షిస్తోంది. కాకపోతే.. నిజంగా టాయిలెట్ కాదది. టాయిలెట్ లాంటి కుర్చీలతో చేసిన కేఫెటేరియా. ఈ కేఫెటేరియాను ఏర్పాటు చేయడానికి ఓ కారణం కూడా ఉంది. మన పరిసరాలను, పరిశుభ్రత గురించి వివరించడం కోసం ఈ కేఫెటేరియాను ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని స్వచ్ఛతా సంవత్సరంగా ప్రకటించింది. అందుకే.. పరిశుభ్రతకు సూచికగా ఇలా టాయిలెట్ కేఫెటేరియాలను ఏర్పాటు చేశారు.

కుంభమేళాలో టెంపోరరీ సిటీనే ఏర్పాటు చేశారు తెలుసు కదా. గంగాయమునాసరస్వతి నదుల సంగమ ప్రాంతమైన ప్రయాగ్ రాజ్ లో 55 రోజుల పాటు ఈ కుంభమేళ జరగనుంది. ఇప్పటికే కుంభమేళాకు ప్రజలు అధిక సంఖ్యలో వెళ్తున్నారు. జనవరి 15న కుంభమేళా ప్రారంభమైంది. మార్చి 4 వరకు కొనసాగుతుంది. మొత్తం 10 కోట్ల మందికి పైగా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో స్నానం ఆచరిస్తారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version