కొరటాల శివ పిల్లలను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా…?

-

కొరటాల శివ… ఈయన సినిమాలు చూసిన వారికి ఎక్కువగా అర్ధమయ్యే విషయం… ఆయనలో సామాజిక స్పృహ ఎక్కువగా ఉంది అని. ఆయన సినిమాలు ఎక్కువగా సామాజిక కోణంలో ఉంటూ ఉంటాయి. మిర్చీ సినిమా ఫ్యాక్షన్ ని అరికట్టే విధంగా, శ్రీమంతుడు సినిమా గ్రామాలను దత్తత తీసుకునే విధంగా, జనతా గ్యారేజ్ లో ప్రకృతి పరిరక్షణ, భరత్ అను నేను సినిమాలో ముఖ్యమంత్రి బాధ్యతలు ఇలా చూపించాడు.

ఇప్పుడు చిరంజీవి తో చేస్తున్న సినిమాలో కూడా దేవాలయాలను కాపాడే ఒక సామాజిక కోణం చూపిస్తున్నారు. అయితే ఇటీవల చిరంజీవి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి కొరటాల శివ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆచార్య నిమిత్తం అతనితో ఇంటరాక్ట్‌ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత కొరటాల శివ లోతైన వ్యక్తిగా కనిపించాడని చిరంజీవి వివరించారు. సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తన్నారు.

జాతీయ, అంతర్జాతీయ విషయాలపై పట్టున్న వ్యక్తని అభినందించారు. దిగజారుతున్న రాజకీయలు, నాయకుల వ్యక్తిత్వాలు-ప్రవర్తన గురించి అతనిలో ఆందోళన ఎక్కువగా ఉందని… డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్న ప్రజల గురించి వ్యధతో మాట్లాడతాడని అన్నారు. కొరటాల శివలోని సేవాతత్పరత నాకు బాగా నచ్చిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. శ్రీమతితో కలిసి తన ఆదాయంలో కొంత భాగాన్ని సమాజసేవకు వెచ్చించే వ్యక్తి కొరటాల అని కొనియాడారు.

పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమనుకుని బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట అన్నారు చిరంజీవి. గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న తనతో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉందని ప్రసంశించారు. అతని చిత్రాల్లో ఆ భావాలు కనపడతాయని వివరించారు. కొరటాల శివ వామపక్ష భావాలున్న మనిషని అన్నారు. ఆ నేపథ్యం నుండి వచ్చాడన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news