తెలుగు వాళ్ళ ఖర్మ కొద్దీ ఈ ట్రంప్ దొరికాడు అనుకుంటున్నారు .. అసలేమైంది ?

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత మొండి ఘ‌ట‌మో అందరికీ తెలిసినదే. నిర్మొహమాటంగా ఎక్కడైనా ఏ విధంగా అయినా తన మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. అవతల వ్యక్తి రిపోర్టర్ అయినా వేరే దేశానికి ప్రధానమంత్రి అయిన లెక్కచేయని విధంగా డోనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అమెరికా దేశం మొత్తం అతలాకుతలమౌతున్న నేపథ్యంలో రకరకాల వార్తలు అంతర్జాతీయ మీడియాలో వినబడుతున్నాయి. రోజుకి కొన్ని వేల సంఖ్యలో కరుణ పాజిటివ్ కేసులు నమోదు కావటం తో పాటుగా వందల మంది అమెరికా దేశంలో మృతి చెందుతున్నారు.Trump Trade War – US Tariffs Expanded to Downstream Aluminum and ...దీంతో చాలా వరకు అమెరికా దేశంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలావరకు కంపెనీలు మూతపడ్డాయి. కాగా ప్రస్తుతం అమెరికాలో చాలా మంది స్థానికులు ఉద్యోగం కోల్పోవడంతో పాటు దేశంలో నిరుద్యోగం ఎక్కువ అవుతున్న తరుణంలో ఇదే ఏడాదిలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే జరగబోయే ఎన్నికలలో ఓన్లీ అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు దేశం ఉండేవిధంగా ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగాన్ని అస్త్రంగా మలుచుకోవడానికి డోనాల్డ్ ట్రంప్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

 

ముఖ్యంగా ఐటీ రంగంపై డోనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టినట్లు ఎక్కువగా ఐటీ రంగంలో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఉండేలా ఎన్నికల ప్రచారంలో వ్యవహరించినట్లు సమాచారం. దీంతో ఎక్కువగా ఐటీ రంగంలో అంటే భారతదేశం నుండి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో..తాజా పరిణామాలు బట్టి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు మా ఖర్మ కొద్ది ఈ ట్రంపు దొరికాడు అని అనుకుంటున్నారు. వచ్చే అధ్యక్ష ఎన్నికలలో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోవాలని మరికొంత మంది కోరుకుంటున్నారని సమాచారం.  

Read more RELATED
Recommended to you

Latest news