పింక్ శారీలో బేబమ్మ సోకుల విందు.. బ్యూటీ ఓవర్​లోడెడ్ అంటూ కుర్రాళ్ల కామెంట్స్

-

టాలీవుడ్‌ బేబమ్మ కృతి శెట్టి తన తొలి సినిమా ఉప్పెనతోనే పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత ఫ్యాన్స్.. అలా అవకాశాలతో టాలీవుడ్​లో దూసుకెళ్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ బిజీ బిజీగా ఉంటోంది. అయితే మొదట్లో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న బేబమ్మకు.. తర్వాత వరుస ఫ్లాప్​లు రావడంతో కాస్త ఫేడ్ అయిపోయింది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలనే తాపత్రయపడుతోంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం బేబమ్మ రేంజే వేరు. ఈ బ్యూటీ ఫాలోవర్లలో సగానికిపైగా కుర్రాళ్లే ఉన్నారు. కృతి తన ఫొటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ బేబమ్మ ట్రెడిషనల్ వేర్​లో ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. క్షణాల్లోనే తెగ లైకులు, షేర్లు, కామెంట్ల వర్షం కురిసింది. ఈ ఫొటోషూట్​లో కృతి పింక్ కలర్ శారీ కనిపించింది.

ట్రెడిషనల్ లుక్​లో కృతి అందంగా కనిపించింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌ ధరించి క్యూట్‌గా పోజులిచ్చింది. తన కాటుక కన్నులతో మెస్మరైజింగ్ స్మైల్​తో కవ్వించింది.ఈ పిక్స్​లో కృతి శెట్టి అందం ఓవర్ లోడ్ అనేలా ఉంది. ఈ ఫొటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కృతి సోయగం చూసి కుర్రాళ్లు బేజారైపోతున్నారు. వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news