ప్రభాస్​, మహేశ్​పై కృతి​ కామెంట్స్​.. ఆ పని చేసేటప్పుడు గొంతు పోయి, దవడ కూడా తెరుచుకోలేదంటూ..

-

పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు స్టార్ హీరోయిన్​ కృతిసనన్ . ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తన తదుపరి చిత్రం ‘తోడేలు’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘1 నేనొక్కడినే’తో నటిగా ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా అప్పుడు మహేశ్‌ నాకెంతో సహకారం అందించారు. ఆయన మంచి వ్యక్తి. చాలా సంవత్సరాల తర్వాత ‘తోడేలు’తో తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమైనందుకు ఆనందిస్తున్నా. ఈ చిత్రాన్ని కూడా మీ అందరూ ప్రేమిస్తారని అనుకుంటున్నా’ అని తెలిపారు. నటుడు వరుణ్‌ ధావన్‌ సైతం.. ‘తోడేలు’ తెలుగులో రిలీజ్‌ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్రబృందం చెప్పిన విశేషాలివే.

“ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి వర్క్‌ చేశానాని.. ఇందులో నటించడానికి ఎనర్జీ ముఖ్యం. ఈ సినిమా చేస్తున్నప్పుడు నా గొంతు ఎన్నోసార్లు పోయింది. దవడ కూడా తెరుచుకోలేదు. నా సినిమా తెలుగులో విడుదలవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇది నాకొక ఇల్లులా ఫీలవుతున్నా. హైదరాబాద్‌లో సినీ ప్రియులెక్కువ. గతంలో నేను నటించిన ‘డ్యాన్స్‌ 3డీ’ తెలుగులోనూ విడుదలైంది. కాకపోతే ఆ సమయంలో మేము ఎక్కువగా ప్రమోట్‌ చేయలేదు. ఇప్పుడు గీతాఆర్ట్స్‌ వల్ల ప్రమోషన్స్‌ చేయడం వీలుపడింది..” అన్నారు వరుణ్ ధావన్.

“తెలుగులో డార్లింగ్ ప్రభాస్‌ అంటే నాకెంతో ఇష్టం అని.. అలాగే ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలు నాకు బాగా నచ్చాయి.. అలాగే వరుణ్‌ సెట్‌లో ఎంతో పాజిటివ్‌, ఎనర్జిటిక్‌గా ఉంటారు. సినిమాలో పనిచేస్తోన్న ప్రతి ఒక్కరి అభినయంపై ఆయన దృష్టి పెడతారు అది నాకెంతో నచ్చింది. పాన్‌ ఇండియా ఒత్తిడి నాకేమీ లేదు. తెలుగు సినిమాతో నా కెరీర్‌ మొదలైంది. ‘ఆదిపురుష్‌’ షూట్‌ అప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే నటిగా తొలి అడుగులేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. మేమంతా ఒక్కటే. మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే మా లక్ష్యం. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లలో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ‘ఆదిపురుష్‌’ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా.. “అని చెప్పుకొచ్చింది కృతి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version