నువ్వు జగన్ రెడ్డి.. రివర్స్ రెడ్డి – చంద్రబాబు ఫైర్

-

నువ్వు జగన్ రెడ్డి.. రివర్స్ రెడ్డి అని  చంద్రబాబు ఫైర్ అయ్యారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో మొక్కలు నాటడం ఇన్నాళ్లూ చూశాం. కానీ సీఎం వస్తున్నారని భారీ వృక్షాలను…అది కూడా ఏ మాత్రం అడ్డుగాలేని చెట్లను నరికి వేయడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నా  మని పేర్కొన్నారు.

మొక్కలు నాటడం నేర్పాల్సిన పాలకులు…చెట్లు నరికెయ్యమని సందేశం పంపుతున్నారా? ఇదే కదా రివర్స్ పాలన అంటే. నువ్వు జగన్ రెడ్డి కాదు…రివర్స్ రెడ్డి. ఇదేం ఖర్మ రాష్ట్రానికి? అని ఫైర్ అయ్యారు.

తిరుపతి ఘటనతో హృదయం చలించిపోతుంది. నడిరోడ్డుపై మహిళ ప్రసవం గుండెను కలచివేస్తుంది. తోడుగా సహాయకులు లేరని పురిటి నొప్పులతో వచ్చిన మహిళలను ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది చేర్చుకోకపోవడం దారుణం. స్థానికులు దుప్పట్లు అడ్డుపెట్టి ప్రసవం చేయించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటి దుస్థితిపై ఎలా చెపితే ఈ ప్రభుత్వానికి అర్ధం అవుతుంది? ఇది కాదా వ్యవస్థల విధ్వంసం అంటే? ఇదేం ఖర్మ రాష్ట్రానికి? అని ప్రశ్నించారు చంద్ర బాబు

Read more RELATED
Recommended to you

Exit mobile version