క్యూట్ పోజులతో కృతి శెట్టి అందాల రచ్చ

-

టాలీవుడ్ బేబమ్మ.. అదేనండి కృతి శెట్టి సోషల్ మీడియాలో మరోసారి రచ్చ లేపుతోంది. క్యూట్ ఫ్రాక్ లో మరింత క్యూట్ క్యూట్ పోజులిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. పింక్ అండ్ వైట్ చెక్స్ గౌనులో కృతి అందాల జాతర అద్దిరిపోయింది. ఈ ఫొటోలు కాస్త తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వెంటనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.

కృతి లేటెస్ట్ లుక్స్ చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. రోజురోజుకూ బేబమ్మ అందం పెరిగిపోతోందని కామెంట్లు పెడుతున్నారు. ఇక హార్ట్ ఫైర్ ఎమోజీలతో కామెంట్స్ బాక్సుల్లో తమ ప్రేమను కుమ్మరించేస్తున్నారు. బేబమ్మ ఈ మధ్య సినిమాల్లో అస్సలు కనిపించడం లేదంటూ తెగ ఫీలయిపోతున్నారు.

ఉప్పెన సినిమాతో ఉప్పెనలా తెలుగు ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన ఈ కన్నడ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాల్లో మంచి ఛాన్సులు కొట్టేసింది. కానీ గత కొంతకాలం నుంచి కృతికి బ్యాడ్ టైం నడుస్తోంది. అవకాశాలు లేక ఇలా సోషల్ మీడియాలో ఫొటోషూట్స్ తో అభిమానులతో టచ్ లో ఉంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news