‘ఖుషీ’ నుంచి రొమాంటిక్‌ రిలీజ్‌..విజయ్‌ ఫ్యాన్స్‌ కు ఇక పండగే

-

 

విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషీ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అప్డేట్స్ కోసం హీరో-హీరోయిన్ల అభిమానులంతా ఎప్పటికప్పుడు తమ ఆసక్తిని కనపరుస్తూనే ఉన్నారు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

 


ఈ మధ్య కాలంలో సమంత చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ ఇదేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని తెలియచేసారు సినిమా సిబ్బంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాగా, ఇవాళ విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు. ఈ తరుణంలోనే..ఈ సినిమాను రొమాంటిక్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news