తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి… విడుదల చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్ కీలకమయిన దశ అన్నారు. ఇంటర్మీడియెట్ లో ఫస్టియర్ లో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.
అమ్మాయిలు 68.85 శాతం పాస్ అయ్యారన్నారు. అబ్బాయిలు 56.80 శాతం మంది పాస్ అయ్యారని చెప్పారు. సెకండియర్ లో 67.26 శాతం పాస్.. సెకండియర్ లో అమ్మాయిలు 73.46 శాతం పాస్… అబ్బాయిలు 60.66 శాతం పాస్ అయినట్లు పేర్కొన్నారు సబితా. జూన్ నాలుగు నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని చెప్పారు సబిత ఇంద్రా రెడ్డి. పిల్లల పై తల్లి దండ్రులు ఒత్తిడి చేయకండని… మొదటి ,ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చివరి స్థానం లో మెదక్ ఉందన్నారు. మొదటి స్థానంలో ములుగు ఉందని వెల్లడించారు.
NOTE : ఇంటర్ ఫలితాల కోసం ఈ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు
TS inter results 2023 link download
tsbie.cgg.gov.in
results.cgg.gov.in
examresults.ts.nic.in
manabadi.co.in (unofficial)