Breaking: బిత్తిరి సత్తి పైన కేసు నమోదు

-

తెలంగాణ కమెడియన్, ప్రముఖ నటుడు బిత్తిరి సత్తికి ఊహించని శాక్ తగిలింది. బిత్తిరి సత్తి పైన తాజాగా కేసు నమోదు అయింది. టాలీవుడ్ నటుడు బిత్తిరి సత్తి పైన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కొంతమంది పోలీసు కేసు నమోదు చేశారు. భగవద్గీత ను కించపరిచేలా వీడియోని చేశారని… ఆరోపణలు చేస్తూ బిత్తిరి సత్తి పైన వానర సేన అనే సభ్యులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

Latest case registered against Bitthiri satti

ఈ నేపథ్యంలోనే బిత్తిరి సత్తి పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి బిత్తిరి సత్తి అసలు పేరు రవి. ఇప్పటికే చాలా చానల్లో జర్నలిస్ట్ గా పని చేశాడు బిత్తిరి సత్తి. వి6 లాంటి ఛానల్ లో బిత్తిరి సత్తిగా మరి బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత అనేక ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు అలాగే సినిమాలు చేసి కూడా… తెలుగు ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు బిత్తిరి సత్తి. అయితే అలాంటి బిత్తిరి సత్తి పైన ఇప్పుడు కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news