భారతదేశ పౌరులకు అవసరమైన అతి ముఖ్యమైన పత్రాలలో ఆధార్ కార్డ్ ఒకటి. ఆధార్ కార్డ్ లేని వారు భారతీయులు కారు. కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ కావాల్సిందే. లేకుంటే ఎన్నో విధాలుగా నష్టపోతాము. ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే మంచి మంచి పథకాలు కోల్పోతాము. ఇక ఈ నేపథ్యంలో తప్పనిసరిగా మన ఆధార్ కార్డులోని వివరాలు సరిగ్గా ఉన్నాయనేది చూసుకోవడం చాలా ముఖ్యం.
మీ ఆధార్ కార్డు వివరాలు ఇతర ID కార్డుల కంటే భిన్నంగా ఉంటే, అది భవిష్యత్తులో మీకు చాలా కష్టమైన సమస్యగా మారవచ్చు. కాబట్టి ఆధార్ కార్డ్ వివరాలను తప్పుగా ఉంటే సవరించుకోవాలి. అయితే ఆధార్ కార్డ్ వివరాలని ఉచితంగా సవరించడానికి కేంద్ర ప్రభుత్వం సమయం కూడా ఇచ్చింది. అయితే ఈ వ్యవధి కూడా అతి త్వరలో ముగుస్తుంది. కాబట్టి కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం నిర్ణయించిన ఆ నిర్దేశిత తేదీలోగా సరిదిద్దుకోకుంటే ఆధార్ వినియోగదారులు రుసుము చెల్లించి సరిచేయాలిసిన పరిస్థితి వస్తుంది.
కాబట్టి ఎలాంటి రుసుము చెల్లించే పరిస్థితి రాకుండా ప్రజలు తమ ఆధార్ కార్డు వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ 14 వ తేదీ అనేది చివరి తేదీ అయ్యింది. సెప్టెంబరు 14 వ లోగా తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునే వారికి ఉచితంగా ఆధార్ అప్‌డేట్ అనేది చేయబడుతుంది.
ఆధార్ కార్డ్ లో మీ వివరాలను అప్‌డేట్ చేయడానికి మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. ఆ తర్వాత, My Aadhaarపైన క్లిక్ చేసి ఆ తర్వాత అప్‌డేట్ ఆధార్‌పైన క్లిక్ చేయండి. ఇక దీని తర్వాత, ఆధార్ నంబర్ ఇంకా అలాగే CAPCHA వెరిఫికేషన్ కోడ్‌ను నమోదు చేసి, Send OTPపై క్లిక్ చేస్తే ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
ఆ OTP తో లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు మార్చాలనుకుంటున్న వివరాలను ఎంటర్ చేసి.. దానికి రుజువును కూడా సమర్పించాలి. ఇక మీ అభ్యర్థన ఆమోదించబడిన తర్వాత, మీకు వెరిఫికేషన్ SMS అనేది పంపబడుతుంది. దానితో మీరు మీ అప్డేట్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు. ఇక ఆధార్ అప్‌డేట్ ఆఫ్‌లైన్ లో కూడా చేయవచ్చు. అయితే మీ ఇంటికి దగ్గరలోని ఈ-సేవా కేంద్రాలకు వెళ్లి మాత్రమే మీరు దీన్ని అప్డేట్ చెయ్యాలి.