వరుణ్ తేజ్ “బాక్సర్” సినిమా లేటెస్ట్ అప్‌డేట్ …!

-

“గద్దలకొండ గణేష్” సినిమాతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ఖాతాలో మరో హిట్ ని వేసుకున్నాడు. హరీష్ శంకర్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసి భారీ వసూళ్ళని రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ మేకోవర్ మెగా ఫ్యాన్స్ నే కాదు ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇదే ఊపుతో మెగా ప్రిన్స్ మరోసారి ప్రయోగం చేస్తున్నాడు. సినిమా సినిమాకి తనని తను కొత్తగా మలుచుకుంటున్న వరుణ్ తేజ్ ఈ సారి బాక్సర్ గా కనిపించబోతున్నాడు.

 

కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న సినిమా ఇప్పటికే వైజాగ్ లో ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. వరుణ్ కెరీర్ లో 10 వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ ఈ సినిమాని నిర్మిస్తుండగా థమన్ సంగీతమందిస్తున్నాడు. గద్దలకొండ గణేష్ సినిమాలో ఊర మాస్‌గా నటించిన వరుణ్ తేజ్ ఇప్పుడు బాక్సర్‌గా ఎలా ఆకట్టుకుంటాడో అన్న ఆసక్తి అందరిలోను నెలకొంది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ కి పనిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లార్నెల్ స్టోవాల్ ఈ సినిమాకి స్టంట్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ పాత్ర కోసం వ‌రుణ్ అమెరికాలో బాక్సింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించనుందని తెలుస్తోంది.

అంతేకాదు కియారా అద్వాని, నిధీ అగర్వాల్ పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక ఈ సినిమాని వాస్తవంగా జూలై ఆఖరిలో రిలీజ్ చేయాలనుకున్నప్పటికి ఒకే ఒక్క షెడ్యూల్ కంప్లీటవడంతో ప్లాన్ అన్ని మారిపోయాయి. దాంతో ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news