శివ నిర్వాణ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లేటెస్ట్ మూవీ ..!

-

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో డిఫ్రెంట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్..వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికి విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం తగ్గనేలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

 

పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ లో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు.

ఇక విజయ్ దేవరకొండ .. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన కంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేస్తాడని లేటెస్ట్ న్యూస్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం శివ నిర్వాణ నాని తో టక్ జగదీష్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. నాని సినిమా కంప్లీట్ అవగానే విజయ్ దేవర కొండ సినిమా మొదలుపెడతాడని తెలుస్తుంది. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తాడని విశ్వసనీయ వర్గాలు ఇస్తున్న సమాచారం.

అయితే ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలాంటి కథ ఉంటుందో అన్న క్యూరియాసిటీ అందరిలోను నెలకొంది. విజయ్ కి అర్జున్ రెడ్డి వంటి కల్ట్ సినిమాతో పాటు గీత గోవిందం లాంటి క్లాస్ మూవీ చేసి 100 కోట్ల హీరో అన్న ఇమేజ్ ని సాధించాడు. ఇక శివ నిర్వాణ ఇప్పటి వరకి నిన్నుకోరి, మజిలీ వంటి కంప్లీట్ క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ని రూపొందించి సపరేట్ ఇమేజ్ ని తెచ్చుకున్నాడు. మరి విజయ్ దేవరకొండ – శివ నిర్వాణ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news