దిల్ రాజు – విజయ్ దేవరకొండ – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబోలో లో లేటెస్ట్ మూవీ ..?

-

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ క్రేజ్ దక్కించుకోవడానికి అతి కొద్ది దూరం లోనే ఉన్నాడు. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే ఇలా పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని ఒక్క విజయ్ మాత్రమే దక్కించుకోబోతుండటం గొప్ప విషయం. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పాన్ ఇండియా లెవల్లో క్రేజీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకి ఇండియా వైడ్‌గా క్రేజ్ పెరిగడం ఖాయమని ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే చెప్పుకుంటున్నారు.

 

ఇక ఈ సినిమా తర్వాత కూడా మరో రెండు ప్రాజెక్టులను విజయ్ దేవరకొండ ప్రకటించాడు. శివ నిర్వాణతో ఓ సినిమా అలాగే దిల్ రాజు నిర్మాతగా మరో సినిమా. అయితే ఇన్నాళ్ళు దిల్ రాజు బ్యానర్ లో ఈ యంగ్ హీరో నటించబోయో సినిమా దర్శకుడు ఎవరు అన్నది మాత్రం వెల్లడించకుండా దాచాడు. అయితే తాజాగా ఆ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ కాంబోలో సినిమా అయితే పక్కా అని ఇటీవల విజయ్ కూడా క్లారిటి ఇచ్చాడు.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ పుట్టిన రోజున ఇంద్రగంటి మోహన కృష్ణ విజయ్ కి శుభాకాంక్షలు తెలిపాడు. అందుకు రిప్లై ఇస్తూ విజయ్ దేవరకొండ మనమిద్దరం కలిసి చెయ్యబోయే అద్భుతమైన పని గురించి నాకు తెలుసుగా అంటూ సమాధానమిచ్చాడు. అయితే వీరి సంభాషణను బట్టి.. ఇంద్రగంటి ఇప్పటికే విజయ్ దేవరకొండకి ఓ కథ వినిపించాడని.. ఆ కథ నచ్చి విజయ్ దిల్ రాజు బ్యానర్ లో చెయ్యడానికి సై అన్నాడని ఇన్‌సైడ్ టాక్ వినబడుతుంది. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దిల్ రాజు నిర్మాణంలో వి కంప్లీట్ చేశాడు. ఈ సినిమా రిలీజయ్యాక దిల్ రాజు – విజయ్ దేవరకొండ – ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబోలో లో లేటెస్ట్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news