పాపం లావణ్య బ్యాడ్ లక్

-

విజయ్ దేవరకొండ, రష్మిక లీడ్ రోల్స్ లో వచ్చిన గీతా గోవిందం సినిమా ఈమధ్యనే రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో విజయ్ కూడా స్టార్ గా ఎదిగాడని అంటున్నారు. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా అలరించింది. ఛలో తర్వాత అమ్మడికి గీతా గోవిందం కూడా సూపర్ హిట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందు ఎవరెవరినో అనుకున్నారట.

స్టార్ హీరోయిన్ దగ్గర నుండి యావరేజ్ హీరోయిన్ దాకా ఈ పాత్రకు నో చెప్పారట. వారిలో లావణ్య త్రిపాఠి కూడా ఉందని తెలుస్తుంది. పరశురాం డైరక్షన్ లో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో హీరోయిన్ గా నటించిన లావణ్య త్రిపాఠి గీతా గోవిందం కథను మాత్రం చేయనని చెప్పిందట. లావణ్య కాదనడంతో ఆ ఛాన్స్ అందుకున్న రష్మిక సూపర్ హిట్ అందుకుంది.

కన్నడ నుండి వచ్చిన రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా రాబోతున్న దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు హిట్ అయితే రష్మిక రేంజ్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news