లావణ్య త్రిపాఠి స్పీడ్ మామూలుగా లేదు ..రేస్ లో రష్మిక, పూజా హెగ్డే లతో పోటీ ..!

‘అందాలరాక్షసి’ సినిమాతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళి నుంచి ప్రశంసలు దక్కించుకుంది. దాంతో ఇండస్ట్రీ దృష్ఠిని బాగా ఆకట్టుకుంది. ఇక మనం సినిమాలో చిన్న గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఇచ్చి ఆకట్టుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్, అల్లు శిరీష్ తో శ్రీరస్తు శుభమస్తు, మన్మధుడు నాగార్జున తో సోగ్గాడే చిన్ని నాయనా లాంటి సినిమాలతో హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంది.

 

అయితే మొదటి సినిమా అందాల రాక్షసి సినిమా నుండి నటనకి ప్రాముఖ్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వస్తుంది లావణ్య త్రిపాఠి. దాంతో తను నటించిన మిస్టర్ లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ రేస్ లో లావణ్య వెనుక పడిపోయింది. ఇదే సమయంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే దూసుకు వచ్చారు. దాంతో టాలీవుడ్ లో లావణ్య త్రిపాఠి కి హీరోయిన్ కెరీర్ క్లోజ్ అయిందని అభిప్రాయపడ్డారు. అయితే నిఖిల్ తో రీసెంట్ గా వచ్చిన ‘అర్జున్ సురవరం’ సినిమా తో సక్సెస్ కొట్టి షాకిచ్చింది.

దాంతో లావణ్య త్రిపాఠి మళ్ళీ ఫుల్ ఫాం లోకి వచ్చేసింది. రీసెంట్ గా తమిళంలో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ అధర్వ మురళీ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలాగే సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లో లావణ్య హాకీ ప్లేయర్ గా నటిస్తోంది. వీటితో పాటు కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’లో హీరోయిన్ గాను ఎంపికైంది. అంతేకాదు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే బికినీ కి రెడీ అంటూ షాకిచ్చింది. దీంతో మేకర్స్ ఇప్పుడు లావణ్య త్రిపాఠి డేట్స్ ని లాక్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. మరోవైపు లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తికరంగా ఉందట. మొత్తానికి లావణ్య త్రిపాఠి స్పీడ్ మామూలుగా లేదు.