గీతా ఛాన్స్ మిస్సైన లావణ్య

-

ఈమధ్య వచ్చిన సినిమాల్లో గీతా గోవిందం సంచలన విజయం అందుకుంది. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన ఈ సినిమాతో అటు విజయ్ ఇటు రష్మిక ఇద్దరు సూపర్ క్రేజ్ ఏర్పరచుకున్నారు. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా రష్మిక బదులు లావణ్య త్రిపాఠిని అనుకున్నారట. ఆల్రెడీ పరశురాం డైరక్షన్ లో వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటించింది లావణ్య.

గీతా గోవిందం సినిమాలో కూడా ముందు ఆమెనే హీరోయిన్ గా అనుకోగా కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారట. అయితే లావణ్య తన పాత్ర విషయంలో కొన్ని అభ్యంతరాలు చెప్పిందట. అందుకే దర్శకుడు హీరోయిన్ గా లావణ్య ప్లేస్ లో రష్మికను సెలెక్ట్ చేశారు. ఈ సినిమా రష్మికకు తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చి పెట్టింది.

అంతేకాదు గీత పాత్రలో లావణ్య చేసుంటే కన్నా రష్మికనే బెటర్ అనేస్తున్నారు. మొత్తానికి గీతా గోవిందం లాంటి హిట్టు మిస్సైన లావణ్య ఫీల్ అవుతుంటే ఇలాంటి హిట్ అందుకున్న రష్మిక వరుస అవకాశాలతో ఫుల్ స్వింగ్ లో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news