ఈ వారం శ్యామలా అవుట్..?

-

మరో మూడు వారాలే ఉన్న బిగ్ బాస్ రియాలిటీ షోలో ప్రతి వారం కాదు కాదు ప్రతి రోజు ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది. ఇంట్లో ఉన్న ఎనిమిది మంది హౌజ్ మెట్స్ లో టైటిల్ విన్నర్ ఎవరవుతారు అన్న ఎక్సైట్మెంట్ ఆడియెన్స్ లో ఉంది. ఓ పక్క కౌశల్ ఆర్మీ తాము సపోర్ట్ చేస్తున్న కౌశల్ కే బిగ్ బాస్ టైటిల్ రావాలన్నట్టు ప్రమోట్ చేస్తున్నారు.

ఆదివారం నామినేషన్స్ లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది. శనివారం ఎపిసోడ్ లో నామినేట్ అయిన కౌశల్, దీప్తి, శ్యామలా, అమిత్ లలో ఎవరిని సేఫ్ జోన్ లోకి పంపించని నాని ఈరోజు ఎవరిని ఎలిమినేట్ చేస్తాడా అన్న ఎక్సైట్మెంట్ ఉంది. అయితే బిగ్ బాస్ లీకుల పుణ్యమాని ఎలిమినేషన్ ముందే తెలుస్తున్నాయి. ఇక ఈరోజు కూడా షో జరగడానికి ముందే ఎలిమినేట్ అయ్యింది ఎవరో చెప్పేస్తున్నారు.

లీకైన వివరాలను బట్టి చూస్తే ఈ వారం శ్యామలా మళ్లీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ లో ఎప్పుడు లేనిది రీ ఎంట్రీ అవకాశం పొందిన శ్యామలా ఫైనల్ గా బిగ్ బాస్ లో ఆమె జర్నీ పూర్తి చేసుకుంది. ఆమెతో పాటుగా రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు లాస్ట్ వీక్ ఎలిమినేట్ కాగా ఈ వారం శ్యామలా బయటకు వచ్చిందట. మరి ఇది వాస్తవా కాదా అన్నది తెలియాలంటే షో చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news