చెర్రీ, ఉపాసనలకు మెగా కోడలు, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులైన ఉపాసన, రామ్ చరణ్ లకు కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. లిటిల్ ప్రిన్సెస్ ను పొందిన అందమైన జంటకు అభినందనలు.
మీ బేబీ ఇప్పటికీ మీతో ప్రయాణం మొదలుపెట్టింది. మీ చిన్నారికి, మీకు ప్రేమ, ఆనందం దక్కాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్ చేశారు. కాగా, ఇటీవల వరుణ్ తేజ్ తో లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక అటు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్యులేషన్స్ రామ్ చరణ్, ఉపాసన. పేరెంట్స్ క్లబ్ లోకి స్వాగతం. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం జీవితాంతం మర్చిపోలేము. ఆ దేవుడి ఆశీస్సులతో పాప, మీరు ఆనందంగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు.