‘లక్మీ బాంబ్’ నుంచి లారెన్స్ ఔట్..!

-

డియర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నేను చెప్పే మాటలు డబ్బుకు, పేరుకు మించినవి. మన క్యారెక్టర్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. అది లేన‌ప్పుడు అందులో కొన‌సాగ‌లేం. అందుకే ‘ల‌క్ష్మీబాంబ్’ నుంచి త‌ప్పుకుంటున్నా. వైదొల‌గ‌డానికి చాలా కార‌ణాలున్నాయి. అవ‌న్నీ చెప్పాల‌నుకోవ‌డం లేదు.

సౌత్ లో కాంచన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ‘కాంచన’, ‘ముని’, ‘గంగా’ హర్రర్ కామెడీ గా భయపెడుతూ కడుపుబ్బ నవ్విస్తున్నాయి. నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ ఈ చిత్రాలను రూపొందించారు. ఈ సిరీస్‌లో భాగంగా కాంచ‌న 3 ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు, తమిళంలో రిలీజ్ అయి రూ.100కోట్లకు పైగా వసూళ్ళని రాబట్టింది.

మ‌రోవైపు ‘కాంచన’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత నెలలో ఈ సినిమా ప్రారంభమైంది. అక్షయ్ కుమార్ సరసన కైరా అద్వానీ నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని శనివారం హీరో అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ‘ఓ మంచి సినిమాని అందించబోతున్నందుకు ఆనందంగా ఉంది’ అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.  ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి దర్శకుడు లారెన్స్ తప్పుకుంటున్నట్టు ప్రకటించి యూనిట్ కి షాక్ ఇచ్చారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఈ మూవీ నుంచి తప్పుకుంటున్నట్టు లారెన్స్ తెలిపారు.

‘డియర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్ నేను చెప్పే మాటలు డబ్బుకు, పేరుకు మించినవి. మన క్యారెక్టర్ కి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. అది లేన‌ప్పుడు అందులో కొన‌సాగ‌లేం. అందుకే ‘ల‌క్ష్మీబాంబ్’ నుంచి త‌ప్పుకుంటున్నా. వైదొల‌గ‌డానికి చాలా కార‌ణాలున్నాయి. అవ‌న్నీ చెప్పాల‌నుకోవ‌డం లేదు. ఫ‌స్ట్ లుక్ నాకు న‌చ్చ‌లేదు. దాన్ని నాకు ఎలాంటి స‌మాచారం లేకుండా విడుద‌ల చేశారు. ఆ విష‌యాన్ని మూడో వ్య‌క్తి నాకు చెప్పారు. నా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల గురించి మ‌రో వ్య‌క్తి చెప్పేవ‌ర‌కు తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన‌డం బాధాక‌రం. ఇది న‌న్ను అగౌర‌వ‌ప‌ర్చ‌డంతో పాటు, నిరాశ‌కి గురిచేయ‌డ‌మే అవుతుంది. ఈ స్క్రిప్ట్‌ను వెన‌క్కి తీసుకుంటున్నా. ఎందుకంటే ఎవ‌రినీ నేను సైన్ చేయ‌లేదు. కానీ వ్య‌క్తిగ‌తంగా నాకు అక్ష‌య్ కుమార్ స‌ర్‌పై గౌర‌వం ఉంది. ఆ రెస్పెక్ట్ తో ఈ క‌థ‌ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. కానీ నేను ద‌ర్శ‌కుడిగా కొన‌సాగ‌లేను. మ‌రే ద‌ర్శ‌కుడితోనైనా చేయించుకోవ‌చ్చు. త్వ‌ర‌లోనే అక్ష‌య్ స‌ర్‌ని క‌లిసి స్క్రిప్ట్‌ అందిస్తా. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద విజ‌యం సాధించాలి’ అని అన్నారు.

దీంతో ఇప్పుడీ వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అక్ష‌య్ కుమార్ లాంటి అగ్ర హీరో సినిమా విష‌యంలో ఇలా జ‌ర‌గ‌డం  ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతుంది. ఏదైనా సినిమా విష‌యంలో ఏం జ‌రుగుతుంద‌నేది ద‌ర్శ‌కుడికి తెలియాలి. ఈ విష‌యంలో ల‌క్ష్మీబాంబ్ బృందం మిస్టేక్ చేసింద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version