తెలుగు దర్శకుడితో లారెన్స్ 25వ సినిమా..!

-

సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్నాడు రాఘవ లారెన్స్. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీగా గడుపుతున్నాడు లారెన్స్. రమేష్ వర్మ దర్శకత్వంలో ఆయన నటించనున్నట్టు   ప్రకటించారు. లారెన్స్ కి  ఇది 25 సినిమా కావడం విశేషం.  ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై  కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ లో షాడో అవతార్లో కనిపిస్తున్న లారెన్స్ ఇమేజ్ ఆసక్తి రేపుతోంది. నవంబర్లో షూటింగ్ ని ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని విషయాలను త్వరలోనే ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. అయితే రమేష్ వర్మ ఇంతకు ముందు రాక్షసుడు, ఖిలాడి వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలు యావరేజ్ టాక్ నే సంపాదించుకున్నాయి. లారెన్స్ నటించబోయే సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news