కొంచెం హాట్ గా.. కొంచెం భయంగా లక్ష్మీరాయ్..’వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ’ ట్రైలర్

-

రత్తాలు.. రత్తాలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో ప్రేక్షకులను అలరించిన లక్ష్మీరాయ్ గుర్తుందా మీకు. అప్పట్లో వచ్చిన కాంచన సినిమాలో బొద్దుగా ఉన్న లక్ష్మీరాయ్… ఇప్పుడు వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ అనే సినిమాలో నటిస్తోంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను కిషోర్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. మహత్, నవీన్ నేని, పంకజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యూట్యూబ్ స్టార్ పూజిత పొన్నాడ అతిథి రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ లో లక్ష్మీరాయ్ తన అందాలను ఆరబోసింది. పూజిత పొన్నాడ కూడా లిప్ కిస్ తో అలరించింది.

ఇప్పటికే రిలీజయిన సినిమా తొలి లిరికల్ సాంగ్.. పాపా నీకేందంటే ఇష్టం, టీజర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news