ఒకటో తారీఖు వచ్చింది…పెన్షన్ ఏదీ..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ పెన్షనర్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకటో తేదీ వచ్చినా పెన్షన్ ఇచ్చే దిక్కు లేక ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పలకరిస్తూ చేతిలో కరెన్సీ నోట్లు పట్టుకుని పెద్దమ్మా బాగున్నావా.. తాతా బాగున్నావా అని పలకరించే వాలంటీర్ల రాక కోసం పెద్దలు ఎదురుచూస్తున్నారు.వాలంటీర్లు ఇచ్చిన డబ్బులతోనే మందులు… పప్పు ఉప్పు…సరుకులు కొనుక్కుంటు జీవనం సాగించేవారు.అయితే గత నెల మాదిరిగానే ఈనెల కూడా వాలంటీర్ రాలేదు… చేతిలోకి పైసలు పడలేదు.పక్కూరు కి వెళ్లి ఎండలో డబ్బులు తీసుకోవాలి అని చెప్పడంతో అవ్వా తాతలు ఆవేదన చెందుతున్నారు.

మండుటెండలో ఎలా వెళ్లాలో ఏమో అంటూ వృద్ధులు.. వికలాంగులు ఆందోళనకు గురవుతున్నారు. చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రలవల్ల వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలు బ్యాంకులకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం మనకు అవుతుందా ? ఆ బ్యాంకుల్లో క్యూలైన్లు..నిలబడడం..ఆ ఫారాలు నింపడం .. ఇదంతా పెద్ద సమస్య.. దానికితోడు కొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతె కొంత పెనాల్టీ విధిస్తాయి. ఇలాంటి నేపథ్యంలో డబ్బులు తీసుకోవడం ఎలా అని అవ్వా తాతలు తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు చేసిన పని వలనే ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నామని తిట్టిపోస్తున్నారు.

పేదల ఖాతాల్లో నిత్యం మినిమమ్ బ్యాలెన్స్ ఉంటుందా అనేది సందేహమే. అలా వాళ్ళు బ్యాలెన్స్ ఉంచకపోతే పాపం వాళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత విధిస్తే అది తమకు నష్టం అని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక … సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు. మొత్తంగా ఓట్లన్నీ ఫ్యాన్ గుర్తుకే వేసి జగన్ ని గెలిపించుకుంటామని చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news