మందేసి..పార్టీలో నానా రభస చేసిన ప్రముఖ యాంకర్ ..!

సినీ ఇండస్ట్రీలో చాలామంది బుల్లితెరపై యాంకర్లుగా పని చేస్తూ ఎంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు వారి పిల్లలు ఎవరివైనా బర్త్డే పార్టీలు, కిట్టీ పార్టీలు, ఫంక్షన్లు అంటూ అర్ధరాత్రి సమయం వరకు పబ్బులకు, పార్టీలకు వెళ్లడం అక్కడే సమయాన్ని గడుపుతూ పెగ్గులు , హగ్గులు అంటూ మితిమీరిపోతున్న విషయాలు రోజూ మనం వింటూనే ఉన్నాం. ఇక మరికొంతమంది స్టార్ సెలబ్రిటీల పిల్లలు అయితే ఏకంగా పబ్లు, పార్టీలు అంటూ డ్రగ్స్ తీసుకున్న సందర్భాలు కూడా రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ యాంకర్ ఒకరి బర్త్డే పార్టీ కి వెళ్లి అక్కడ ఫుల్లుగా మందు తాగి ..చిందులేసినట్టు ఒక గాసిప్ బాగా బలంగా వినిపిస్తోంది.

సాధారణంగా సినీ సెలబ్రిటీలు కేవలం సెలబ్రిటీల బర్తడే పార్టీలకు, కిట్టీ పార్టీ లకు మాత్రమే హాజరవుతూ ఉంటారు. కానీ ఇక్కడ బర్తడే మాత్రం ఒక సెలబ్రిటీది కాదు.. టాలీవుడ్ సెలబ్రిటీలతో సంబంధాలు మెయింటైన్ చేస్తూ.. తన బ్రాండింగ్ తో వారిని తన దగ్గరకు చేర్చుకుంటూ సోషల్ మీడియాలో కూడా సెలబ్రిటీ స్టేటస్ ను సంపాదించుకున్న ఒక బిజినెస్ మాన్ బర్తడే. ఇక ఈ యాంకర్ ఈ బిజినెస్ మాన్ ఏర్పాటుచేసే క్లోజ్ పార్టీలకు పేకాట లకు పర్మనెంట్ గెస్ట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం హాగ్గులు, పబ్బులు తప్ప అంతకు మించి ఆమె హద్దులు దాటదు అని తెలుస్తోంది.

ఇక అసలు విషయం ఏమిటంటే.. బర్తడే పార్టీకి వెళ్లిన సదరు యాంకర్ అక్కడ రెండు పెగ్గులు వేసి, తర్వాత కొంచెం హల్చల్ చేసిందట. మత్తు ఎక్కువ అయ్యి అదుపుతప్పి కొంచెం అటూ ఇటూ ఊగడం తో అక్కడ ఉన్న వారు ఆమెకు సహాయం చేశారనే వార్త వైరల్ అవుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆ సెలబ్రిటీ క్లోజ్డ్ గ్రూప్లో మాత్రం ఈ యాంకర్ పర్మనెంట్ గెస్ట్ అని తెలుస్తోంది.