అరవింద సమేత లీకులు ఆగట్లేదు..!

-

Leaks Continues for NTR Aravinda Sametha

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి మొడటిసారి చేస్తున్న క్రేజీ మూవీ అరవింద సమేత. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా లీకుల విషయంలో చిత్రయూనిట్ కంగారు మొదలైంది. తారక్ ప్రతి సినిమా విషయంలో ఈ లీక్స్ జరుగుతూనే ఉన్నాయి. జై లవ కుశ టీజర్ కూడా రిలీజ్ కు ముందే లీక్ అయ్యింది.

అలానే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అరవింద సమేత సినిమా నుండి ఓ పిక్ సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. తారక్ వీర రాఘవ లుక్ లో కనిపిస్తున్న ఆ పిక్ లీక్ పట్ల గందరగోళం మొదలైంది. ఈ లీకుల పట్ల త్రివిక్రం, ఎన్.టి.ఆర్ చాలా అప్సెట్ అయ్యారట. అందుకే షూటింగ్ టైంలో సెల్ ఫోన్స్ కూడా ఎలో చేయట్లేదట.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న అరవింద సమేత ప్రేక్షకుల ముందుకు రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news