కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే లియో సినిమాతో థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే. డ్యూయెల్ రోల్స్‌లో విజయ్ కనిపించడం.. అది కూడా చాలా ఏళ్ల తర్వాత గ్లామర్ బ్యూటీ త్రిషతో కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు చాలా నెలకొన్నాయి. దీనికి తగ్గట్టు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకు ఫుల్ హైప వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టే సినిమా కూడా హిట్ కొట్టింది. పాజిటివ్ టాక్‌తో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు సాధించింది.
ఇక లియో ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే ఈసారి నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించి రెండు తేదీలను ఫిక్స్ చేసింది. అందులో ఒకటి నవంబర్ 24, మరోది నవంబర్ 28. అయితే నవంబర్ 24న ఇండియాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మాత్రం నవంబర్ 28వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సినిమాలో సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలక పాత్రలు పోషించారు.