నేను రెడ్డినే అంటూ కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

నేను రెడ్డినే అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను రెడ్డిని.. ఒక రెడ్డిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించిన తర్వాత బీసీని సీఎం చేస్తామని చెప్పిందని కిషన్‌ రెడ్డి చెప్పారు. ఇవాళ మీడియాతో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ… ఇది బీజేపీ సామాజిక న్యాయం.. రిజర్వేషన్ పరిధిలో రాని వారికి కూడా రిజర్వేషన్ కల్పించిన ఘనత మోడీ ప్రభుత్వానిదే అన్నారు.

kishan reddy comments on reddy

సీఎం కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిపై రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఎంత పెద్ద వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌…..మాకు వేయండని కోరుతున్నారట…. ఎంపీకి బీజేపీకి వేయాలని అడుగుతునట్టు తెలుస్తుంది.. ప్రజలు ఎమ్మెల్యే, ఎంపీకి మాకే వేస్తారు.. ఆ రెండు పార్టీలను పాతరేస్తారని స్పష్టం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. తాము బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ల వంటి వారం కాదంటూ.. మేనిఫెస్టోను అధికారంలోకి రాగానే అమలు చేసి మాట మీద నిలబడే పార్టీ నుంచి వచ్చిన వారమని ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news