ఎన్టీఆర్ లాగే పవన్ కళ్యాణ్ కి కూడా వెన్నుపోటు తప్పదు..వర్మ..!

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్స్ తో వార్తల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్యన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఎక్కువగా ట్వీట్లు చేస్తూ మరొకసారి వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తాజాగా మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. దివంగత సీనియర్ నటుడు ఎన్టీఆర్ లాగే పవన్ కళ్యాణ్ కి కూడా వెన్నుపోటు పొడుస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ. పవన్ కళ్యాణ్ తోపాటు జనసైనికులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు..

ఆర్జివీ తన ట్విట్టర్ ద్వారా.. “ప్రియమైన జనసైనికులారా! దయచేసి మన లీడర్ కు వెన్నుపోటు పొడిచే నాదెండ్ల భాస్కర రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ కి దూరంగా ఉండమని చెప్పండి.ఇంతకుముందు పవనిజం పుస్తకం రాసిన రాజు రవితేజ గురించి ఇలాగే వార్నింగ్ ఇచ్చాను. అతని విషయంలో నా మాటే నిజమైంది. జై జనసేన” అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు వర్మ.

మరొక ట్వీట్ లో ఆనాడు జూనియర్ సీజర్ ని బ్రూటస్.. ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచినట్లు ఈసారి పవన్ కళ్యాణ్ ని నాదెండ్ల మనోహర్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారు . ఈ విషయాన్ని రాత్రి నాకు కలలో దేవుడు వచ్చి చెప్పాడు” అని జనసైనికులకు వార్నింగ్ ఇచ్చారు . ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇదివరకు పవన్ కళ్యాణ్, నాగబాబులపై రకరకాలుగా స్పందించి విమర్శలు గుప్పించిన వర్మ.. ఇప్పుడు ఇలా సలహాలు ఇస్తుంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏమైనా వర్మ చేసిన ఈ కామెంట్ లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.