నా మాట విను సుక్కూ ..దేవి వద్దు థమన్ ..ముద్దు ..!

483

సుకుమార్-అల్లు అర్జున్-దేవిశ్రిప్రసాద్ ..ఈ కాంబో అంటేనే ఆర్య అందరికి ముందు గుర్తొస్తుంది. ఆర్య 2 కూడా మ్యూజికల్ గా హిట్ అనే చెప్పాలి. ఆ తర్వాత సుక్కు-దేవి కలిసి చాలా సినిమాలకి పని చేశారు సూపర్ హిట్స్ ని అందుకున్నారు. కానీ మధ్యలో అల్లు అర్జున్ మిస్సయ్యాడు. మళ్ళీ ఇన్నేళ్ళకి ఈ ముగ్గురి కాంబోలో సినిమా వస్తుందని అనుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సుకుమార్ కి అల్లు అర్జున్ కి మధ్యన మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో తీవ్రమైన చర్చ జరుగుతున్నట్టుగా వార్త ఒకటి వైరల్ గా మారింది.

 

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా బన్ని సినిమాకి ఫిక్స చేశాడు. అయితే సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ గా పెద్ద హిట్ అవడంతో అల్లు అర్జున్ థమన్ నే సుక్కు సినిమాకి తీసుకుందామని ప్రపోజల్ పెట్టడమే కాదు.. సుక్కుని గట్టిగా వారిస్తున్నాడట కూడా. కాని సుక్కుకి, దేవిశ్రీ మీద పూర్తి నమ్మకంతో ఉండడంతో అల్లు అర్జున్ ని కన్విన్స్ చేస్తూ వస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

 

అందుకే అల్లు అర్జున్ పెట్టిన ప్రపోజల్ ని సుకుమార్ సున్నితంగా తిరస్కరించి, దేవిశ్రీ బెస్ట్ సాంగ్స్ ఇస్తాడని కన్విన్స్ చేశాడట. సుకుమార్ తో దేవిశ్రీ రంగస్థలంతో బెస్ట్ ఆల్బమ్ చెయ్యడమే కాకుండా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డులు, రివార్డులు అందుకున్నాడు కూడా. అందుకే సుక్కు, అల్లు అర్జున్ ఏం చెప్పిన వినకుండా దేవితోనే ఈ సినిమా కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయ్యి అల్లు అర్జున్ కూడా తన మాట కాదనకని బ్రతిమాలుతున్నాడట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు గాని థమన్ మాత్రం దేవిశ్రీప్రసాద్ కి గట్టి దెబ్బే వేస్తున్నాడు. అయితే ఇక్కడం వాస్తవం మాట్లాడుకుంటే మాత్రం గత కొంతకాలంగా దేవీ మ్యూజిక్ అసలు మెప్పించలేకపోతోంది. అందుకు తాజా ఉదాహరణ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అని చెప్పాలి. ఆ సినిమా మ్యూజికల్ గా పెద్ద ఫ్లాప్ అని ఫ్యాన్సే తేల్చి చెప్పారు.