మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మాటలతోనే మాయ చేసేస్తాడు. ఈయన చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ప్రస్తుతం చలామణి అవుతున్నారు. ఈయన సినిమాలన్నీ ఓ సపరేట్ స్టైల్‌లో ఉంటాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఆయన మనసుపెట్టి ఏదైనా మాట రాస్తే అది ఎప్పటికీ మనకు గుర్తిండిపోతుంది. వందేళ్ల జీవితాన్ని కూడా వంద అక్షరాల్లో రాయగల సిద్ధహస్తుడు త్రివిక్రమ్. అందుకేనేమో మాటల మాంత్రికుడు అనే బిరుడు కూడా సంపాదించుకున్నాడు.
ఇవన్నీ పక్కన పెడితే.. ఈ ఏడాది ఆరంభంలోనే టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన త్రివిక్రమ్ బాక్సాఫిస్ వల్ల భూకంపాన్ని సృష్టించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమేగాక బాహుబలి కలెక్షన్స్ కూడా బ్రేక్ చేసింది. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాను పట్టాలెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే వాస్తవానికి త్రివిక్రమ్ మొదట స్క్రిప్ట్ రాసుకుని తర్వాత దానికి డైలాగ్స్ వెర్షన్ సిద్ధం చేసుకుని దాదాపు ఆరు నెలలకు పైగా దీనికే సమయం వెచ్చిస్తాడు.
కానీ, ఎన్టీఆర్ సినిమాకు కేవలం నాలుగు నెలలే ఉండడంతో మొదల కాస్త సతమతమైనట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ అవ్వడంతో సినిమా షూటింగ్ లు అన్నీ ఆగిపోవడంతో త్రివిక్రమ్‌కు కలిసొచ్చినట్టు అయింది. ఎందుకంటే.. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ సైతం ఆగిపోయింది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ అవ్వాలంటే ఆగస్ట్ వరకూ టైమ్ పట్టొచ్చు. దీంతో ఈ ఏడాది చివరికి కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కదు. ఈ గ్యాప్ ను త్రివక్రమ్ స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారట. ఈ క్రమంలోనే మాటల మాంత్రికుడు నిజంగా లక్కినే అంటున్నారు కొందరు.