ఓటీటీలోకి నవదీప్ ‘లవ్ మౌళి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?

-

టాలీవుడ్ న‌టుడు నవదీప్ ఇటీవల నటించిన సినిమా ‘లవ్ మౌళి’. చాలా గ్యాప్ తర్వాత నవదీప్ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అవ‌నీంద్ర ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. పంఖురి గిద్వానీ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాను నైరా క్రియేషన్స్,  శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. జూన్‌ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా విడుద‌లై మూడు వారాలు కూడా కాక‌ముందే ఓటీటీ లాక్ చేసుకుంది. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో జూన్‌ 27వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

లవ్ మౌళి స్టోరీ ఇదే.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవ‌డంతో మౌళి (న‌వ‌దీప్‌) ఒంట‌రిగా పెరుగుతాడు. మేఘాల‌య‌లోని రిసార్ట్‌లో ప్ర‌కృతి మ‌ధ్య త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా బ‌తుకుతుంటాడు. పెయిటింగ్స్‌ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. తన చిన్న‌త‌నం నుంచి చూసిన, ఎదురైన సంఘటనలు, అనుభవాల కార‌ణంగా మౌళికి ప్రేమ‌పై పెద్దగా న‌మ్మ‌కం ఉండ‌దు. అదే సమయంలో ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) ఇచ్చిన పెయింటింగ్ బ్ర‌ష్‌తో తాను కోరుకునే ల‌క్ష‌ణాలున్న అమ్మాయిని సృష్టించే శ‌క్తి మౌళికి వ‌స్తుంది. స్వతహాగా చిత్రకారుడైన మౌళి వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు వారి ప్రేమ బంధం సాఫీగా సాగుతుంది. ఆ త‌ర్వాత‌ చిత్ర‌తో గొడ‌వ‌లు రావ‌డంతో మ‌రో పెయింటింగ్ గీస్తాడు మౌళి. మరోసారి కూడా చిత్ర‌నే అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. మరి ఆ తర్వాత మౌళి, చిత్ర ఒక్క‌ట‌య్యారా? మౌళి ప్రేమకు గుడ్‌బై చెప్పడానికి కారణం ఏంటి?ప్రేమకు నిజ‌మైన అర్థాన్ని మౌళి ఎలా తెలుసుకున్నాడు? అన్న‌దే ఈ చిత్ర కథ.

Read more RELATED
Recommended to you

Exit mobile version