ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి ‘మహాకాళీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!

-

టాలీవుడ్ లో ఫస్ట్ సూపర్ హీరో మూవీ హనుమాన్ అని అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో మరిన్ని సినిమాలు వస్తాయని ఇదివరకే ప్రకటించాడు.

తాజాగా ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి మూడో సినిమాకి సంబంధించిన అప్ డేట్ ను దేవీ నవరాత్రుల సమయంలో ప్రకటించేశాడు. ఈ చిత్రానికి మహాకాళీ అనే టైటిల్ ఖరారు చేశాడు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ సినిమా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్ పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహాకాళీ టైటిల్ రివిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఒక అమ్మాయి తన తలను పులికి సున్నితంగా తాకినట్టు చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆక్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news