ఎస్సై వేధింపులు.. మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం!

-

తనతో కలిసి పనిచేస్తున్న ఎస్సై తరచూ వేధిస్తున్నాడని ఓ ఏఎస్సై విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అంతకుముందు ఎస్సై వేధింపుల గురించి జిల్లా ఎస్పీకి బాధితురాలు లేఖ రాసింది. ఈ ఘటన మెదక్ జిల్లా చిలిప్ చేడ్ పోలీస్‌స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఎస్సై యాదగిరి తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా ఏఎస్సై పీఎస్‌లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఆమె సోదరుడు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది.

తమ స్టేషన్ ఎస్సై యాదగిరి రెండ్రోజులుగా కంటిన్యూగా డ్యూటీ వేసి.. ఒకరోజు రెస్ట్ తీసుకుంటే ఆబ్సెంట్ వేస్తున్నాడని, ఆయనకు లొంగకపోతే ఇలా మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు లేఖలో పేర్కొంది. అందరినీ ఒకలా, తనను మరోలా చూస్తున్నాడని..ప్రతి చిన్నదానికి డ్యూటీకి ఆబ్సెంట్ వేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది.తనకు ఏం జరిగినా కారణం ఎస్సై యాదగిరినే అని, మహిళా పోలీసులను లొంగదీసుకోవాలని చూసే అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని,కఠినంగా శిక్షించాలని లేఖలో వేడుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news