చిన్నారి గుండె ఆపరేషన్ కి మహేష్ బాబు సాయం. నిజంగా సూపర్ స్టారే..

సూపర్ స్టార్ మహేష్ బాబు నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్నాడు. సినిమాల్లో హీరోగా చేసే మహేష్ బాబు, రియల్ లైఫ్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలని కాపాడుతున్నాడు. ఇప్పటికే కొన్ని వందల మంది చిన్నారులకి గుండె ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలని నిలబెట్టాడు. తాజాగా మరో చిన్నారి పాప గుండె ఆపరేషన్ కి కావాల్సిన సాయం అందించాడు.

https://www.instagram.com/p/CG_8tzCDAvR/?utm_source=ig_web_copy_link

ఈ మేరకు మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, సోషల్ మీడీయాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. చిన్నారి హృదయ నాళానికి ఆపరేషన్ జరిగిందని, అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అటు తన సినిమాలు చేసుకుంటూనే ఇటు పక్క సమాజ సేవ చేస్తున్న మహేష్ నిజంగా సూపర్ స్టారే కదా..!