‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ వచ్చేసింది…..!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ 26వ సినిమాగా తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు నుండి ఇప్పటికే మూడు సాంగ్స్ మరియు అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక వాటికి ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన లభించడంతో పాటు సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మహేష్ బాబు తన ఎంటైర్ కెరీర్ లో తొలిసారిగా ఒక ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. అలానే టాలీవుడ్ లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతిఈ సినిమా ద్వారా చాలా ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండడం తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి.

వరుస హిట్స్ తో దోసుకుపోతున్న యువ సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకరలు ముగ్గురూ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నుండి టైటిల్ ట్రాక్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆర్మీ జవానుల గొప్పతనాన్ని మరియు త్యాగ నిరతిని చాటిచెప్పే విధంగా ఎంతో అత్యద్భుతంగా పాట సాగిందని పలువురు శ్రోతలు ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన ఈ సాంగ్ కు రామ జోగయ్య శాస్త్రి హృద్యమైన సాహిత్యాన్ని అందించగా, దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మంచి ట్యూన్ ని అందించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక జనవరి 5న ఎంతో వైభవంగా హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగనున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్న ఈ వేడుకకు ఇప్పటికే చాలావరకు ఏర్పాట్లు మంచి జోష్ తో జరుగుతున్నాయి. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని జనవరి 11న వరల్డ్ వైడ్ గా ఎంతో భారీగా రిలీజ్ చేస్తున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news